telugu navyamedia
సినిమా వార్తలు

`ఛ‌లో ప్రేమిద్దాం` మూవీ టీజ‌ర్ లాంచ్‌..

సాయి రోన‌క్‌,  నేహ‌ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖ‌ర్ రేపల్లే ద‌ర్శ‌క‌త్వంలో ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మిస్తోన్న చిత్రం `ఛ‌లో ప్రేమిద్దాం`.  ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని ఈ నెలలోనే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఈ సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన  టీజ‌ర్‌ను లాంచ్  చేశారు చిత్ర యూనిట్.  ఒక‌సారి టీజ‌ర్‌ చూస్తే దొర‌వారు హైద‌రాబాద్‌కేనా..వెళ్ళూ.. ఒక పిల్ల‌ను చూడు!! వెంట‌ప‌డు.. ఆ పిల్ల‌ను ప‌డేయ్‌..సినిమాలు… షికార్లు.. తెగ తిరిగేయండి… అంటూ పోసాని కృష్ణ‌ముర‌ళి వాయిస్ ఓవ‌ర్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మైంది. 1.17 నిమిషాల నిడివి గ‌ల టీజ‌ర్ తో ఇది ఒక ల‌వ్ అండ్ స‌స్పెన్స్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్  చిత్ర‌మ‌ని ద‌ర్శ‌కుడు సురేష్ శేఖ‌ర్ చెప్ప‌క‌నే చెప్పారు. ఇప్పుడే పెళ్ల‌యింది.. ఫోన్ మాట్లాడ‌కండి..మ్యాట‌ర్ ప‌నిచేయ‌ద‌ని హీరోయిన్ చెప్పిన డైలాగ్‌కి కౌంట‌ర్ గా హేమ పోసానిని ఉద్దేశించి `ఈయ‌న మ్యాట‌ర్ ప‌నిచేయ‌క చాలా సంవ‌త్స‌రాల‌య్యింది` అంటూ చెప్పే డైలాగ్ అదిరింది.

ఈ టీజ‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది.. ఈ చిత్రంలో కావాల్సినంత‌ ఫ‌న్ కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇలా ల‌వ్, రొమాంటిక్ , ఫ‌న్ తో సంద‌డి సంద‌డిగా  సాగిపోతున్న టీజ‌ర్ … సిజ్జు  ఎంట్రీతో ఒక్క‌సారిగా యాక్ష‌న్ మూడ్‌లోకి షిఫ్ట్ అవుతుంది.  హీరో హీరోయిన్స్ లుక్స్ స్ట‌న్నింగ్ గా ఉన్నాయి. ఈ జంట‌ను  చూస్తుంటే ఫ్రెష్ అండ్ ఫీల్ గుడ్ మూవీలా క‌నిపిస్తోంది.

డైరెక్ట‌ర్ టేకింగ్, సినిమాటోగ్ర‌ఫీ చాలా రిచ్‌గా ఉన్నాయి. భీమ్స్ అందించిన సంగీతం టీజ‌ర్‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఓవ‌రాల్‌గా సినిమా యూత్‌తో పాటు అన్ని ర‌కాల ఆడియెన్స్‌కి న‌చ్చేలా ఉండ‌బోతోందని టీజ‌ర్ తో అర్థ‌మైంది.

ఇటీవ‌ల ఈ చిత్రంలోని ఫ‌స్ట్ సింగిల్ విడుదలై యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో కామెంట్స్ తో దూసుకుపోతుంది. త్వ‌ర‌లో మిగ‌తా సాంగ్స్ విడుద‌ల చేసి సినిమాను ఈ నెల్లోనే గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Related posts