telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రైతు పాత్రలో నాగ్ ?

Nag

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున ప్రస్తుతం అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వైల్డ్‌ డాగ్‌’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ తరువాత రాజశేఖర్‌కు ‘గరుడవేగ’తో కమర్షియల్‌ హిట్‌ అందించిన ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తార్‌ చెప్పిన కథకు నాగార్జున గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. నాగార్జున ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకొని పక్కా పవర్‌ఫుల్‌ స్క్రిప్ట్‌ను దర్శకుడు రెడి చేసినట్లు సమాచారం. ఒక సామాన్యమైన ఆ రైతు తన కూతురును ఎలా కనిపెట్టాడు? అందుకోసం ఎంతటి సాహసాన్ని చేశాడు అనేది కథాంశంగా చెబుతున్నారు. ఈ కథలో రైతు పాత్రను నాగార్జున పోషించనున్నాడట. ఒక పాపకు తండ్రి పాత్రలో నాగార్జున నటించబోతున్నాడు.

Related posts