telugu navyamedia
సినిమా వార్తలు

‘విక్కీ ది రాక్ స్టార్’ మోషన్ పోస్టర్ రిలీజ్..

విక్రమ్, అమృత చౌదరి హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘విక్కీ ది రాక్‌స్టార్’. గతంలో ఎప్పుడూ టచ్ చేయని వైవిద్యభరితమైన కథాంశానికి, హై ప్రొడక్షన్ వాల్యూస్ జోడించి డైరెక్టర్ సి. ఎస్ గంటా. వర్దిని నూతలపాటి సమర్పణలో ఈ చిత్రాన్ని లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ‘విక్కీ: ది రాక్ స్టార్’ ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది.

నేల పై సాగు చేసే రైతు ఆకాశం వైపుకి , ఆకాశమే హద్దు గా భావించే యువత నేల వైపుకి , ఒక వైపు నాగలితో రైతన్న, మరో వైపు గిటార్ తో ‘విక్కీ : ది రాక్ స్టార్’ రైతు కాలికి ముద్దు పెడుతూ ఉన్న ఈ పోస్టర్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ‘నీ కాళ్ళకే ముద్దులె పెట్టనా ఫార్మర్’ అంటూ బాక్ గ్రాండ్ లో వస్తున్న లిరిక్ హృదయానికి హత్తుకునేలా ఉంది.

ఈ తరం యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు . పలు హిట్ సినిమాలకు సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.

 

Related posts