telugu navyamedia
సినిమా వార్తలు

“డియర్ కామ్రేడ్” ప్రీమియర్ షో కలెక్షన్స్… మెగా రికార్డును దాటేసిందిగా…!

Dear-Comrade

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం “డియర్ కామ్రేడ్”. ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “అర్జున్ రెడ్డి” చిత్రం నుంచి ఈ యంగ్ హీరో సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. తాజాగా “డియర్ కామ్రేడ్” చిత్రంతో కూడా మరో రికార్డును క్రియేట్ చేశాడు విజయ్. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోల సినిమాల కలెక్షన్లు సాధారణంగా ఉండవన్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ నటించిన “డియర్ కామ్రేడ్” సినిమా తాజాగా విడుదల అయ్యి యూఎస్ ప్రీమియర్ షోలో రికార్డులు సృష్టిస్తోంది. ఈ ప్రీమియర్స్ ద్వారా డియర్ కామ్రేడ్ 2.5 లక్షల డాలర్లను వసూలు చేసింది. ఇది రామ్ చరణ్ వినయ విధేయ రామ ప్రీమియర్ కలెక్షన్ల కంటే ఎక్కువ. టాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన ఒక కుర్ర హీరో సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు అని అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు. ఇప్పటికే ఈ ఏడాది ప్రీమియర్ ద్వారా మహర్షి – 5.16 లక్షల డాలర్లు, ఎన్టీఆర్ కథానాయకుడు – 4.83 లక్షల డాలర్లు, ఎఫ్ 2 – 2.59 లక్షల డాలర్లు వసూలు చేశాయి. ఈ మూడు డియర్ కంటే ముందున్నాయి. ఇటువంటి క్రమంలో డియర్ కామ్రేడ్ సినిమా మొదటి రోజే ఈ విధమైన కలెక్షన్లు వసూలు చేయటం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ సినిమా మరింత ఇండస్ట్రీ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు ట్రేడ్ వర్గాల వారు. ముఖ్యంగా మొదటి రోజే ఓవర్సీస్ లో కలెక్షన్ల లో మెగా హీరో సినిమాని పక్కకు నెట్టి ఈ సినిమా కలెక్షన్లు రాబాడుతుంటే కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర ‘డియర్ కామ్రేడ్’ హిస్టరీ క్రియేట్ చేస్తుందని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts