telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సమంతకు సారీ చెప్పు… పూజాహెగ్డేను ఏకిపారేస్తున్న సామ్ ఫ్యాన్స్

Pooja-and-Sam

సమంత ఫ్యాన్స్ ఇప్పుడు పూజాహెగ్డేపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. #PoojaMustApologizeSamantha అనే హ్యాష్ ట్యాగ్‌తో పూజా హెగ్డేకు వ్యతిరేకంగా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ఇండియాలో టాప్ ట్విట్టర్ ట్రెండ్. దీనికి కారణం పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో సమంతపై చేసిన కామెంట్. ‘సమంత అందంగా ఉంటుందని నేను అనుకోవడం లేదు’ అని పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. ఇది చూసిన సమంత అభిమానులు ఆ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్‌లో ఏకేయడం మొదలుపెట్టారు. అయితే, తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని నిన్న అర్ధరాత్రి దాటిన తరవాత పూజా హెగ్డే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నా ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్‌ అయ్యింది. నేను నా టీమ్‌కు సమాచారం ఇచ్చాను. నా డిజిటల్ టీమ్ దీనిపై పనిచేస్తోంది. దయచేసిన ఎలాంటి ఇన్విటేషన్లను యాక్సెప్ట్ చేయకండి. వ్యక్తి గత సమాచారం కూడా షేర్ చేసుకోకండి’’ అని ట్వీట్‌లో పూజా పేర్కొన్నారు. ఆ తరవాత ఒక గంటలకు పూజా మరో ట్వీట్ చేశారు. ‘‘నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ భద్రత కోసం గంటపాటు చాలా కష్టపడ్డాం. ఇలాంటి సమయంలో తక్షణమే సహాయాన్ని అందించిన నా టెక్నికల్ టీమ్‌కి కృతజ్ఞతలు. మొత్తానికి మళ్లీ నా ఇన్‌స్టాగ్రామ్ నా చేతుల్లోకి వచ్చింది. గడిచిన గంట సమయంలో నా అకౌంట్ నుంచి ఏమైనా పోస్ట్‌లు వచ్చి ఉంటే వాటన్నింటినీ తీసేశాను’’ అని పూజా తన రెండో ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ ట్వీట్లలో అసలు సమంత గురించి ప్రస్తావించకపోవడం అభిమానులకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. మొత్తానికి పూజా హెగ్డే ఇన్‌స్టా పోస్ట్ పెద్ద యుద్ధానికే తెరలేపింది. తాజాగా సమంత విక్టరీ సింబల్ చూపిస్తూ దిగిన ఫొటోను ట్వీట్ చేశారు. ఇది ఫ్యాన్స్‌ని కూల్ చేయడానికి చేసిన ట్వీట్‌లా అనిపిస్తోంది.

Related posts