telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇందులో దాచేదేమీ లేదు… కాస్టింగ్ కౌచ్ పై అనుష్క షాకింగ్ కామెంట్స్

Anushka

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వల్ల ‘‘మీటూ’’ లాంటి ఉద్యమాలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తరువాత చాలామంది నటీమణులు ముందుకొచ్చి తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టారు. తాజాగా స్టార్ హీరోయిన్ అనుష్క దీనిపై స్పందించింది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనుష్క… తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ కాస్టింగ్ కౌచ్ ఉంద‌ని, ఇందులో దాచేదేమీ లేదని చెప్పుకొచ్చింది. తాను కూడా కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బందులు పడ్డానని, కెరీర్ ఆరంభంలో అలాంటి కొన్ని అనుభవాలు ఎదురుకాగా.. ధైర్యంగా, ముక్కుసూటిగా ఉండటం వల్ల కాస్టింగ్ కౌచ్ నుంచి తప్పించుకోగలిగానని అనుష్క తెలిపింది. అయితే ఇప్పటిదాకా తనతో ఎవ్వరూ మిస్ బిహేవ్ చేయలేదని చెబుతూ, ఈ ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కాదు అన్ని రంగాల్లోనూ ఆడవాళ్ళకి వేధింపులు తప్పడం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది అనుష్క.ఈ మధ్యకాలంలో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన అనుష్క.. ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ సినిమాలో నటిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించారు. మాధవన్, షాలిని పాండే తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అతిత్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts