telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

క్వారంటైన్ టైమ్‌‌లో ఎన్టీఆర్ ఏమి నేర్చుకుంటున్నాడో తెలుసా…

NTR

దేశంలో కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో షూటింగ్స్ అన్నీ బంద్ చేసుకొని ఇంట్లోనే గడుపుతున్నారు సెలెబ్రిటీలు. ఈ క్వారంటైన్ సమయాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా వినియోగించుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఈ క్వారంటైన్ టైమ్‌‌లో మలయాళీ భాష నేర్చుకుంటున్నారని తెలుస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న’ఆర్ ఆర్ ఆర్’ సినిమా కోసం తారక్ మలయాళీ భాషపై ఫోకస్ పెట్టారట. ఇటీవలే ‘ఆర్ ఆర్ ఆర్’ నుంచి ‘భీమ్ ఫ‌ర్ రామ‌రాజు’ అంటూ వీడియో ప్రోమో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ప్రోమోలో తార‌క్ వాయిస్ ఓవ‌ర్ విన్నాం. ఐదు భాష‌ల్లో విడుద‌లైన ఈ ప్రోమోల‌కు మ‌ల‌యాళం త‌ప్ప మిగిలిన భాష‌ల‌కు తార‌క్ డ‌బ్బింగ్ చెప్పారు. అయితే ఈ ఖాళీ సమయంలో మ‌ల‌యాళం కూడా నేర్చుకుని డబ్బింగ్‌ చెప్పేందుకు రెడీ అవుతున్నారట ఎన్టీఆర్. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ రోల్ పోషిస్తున్నారు. ఆలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేశారు జక్కన్న.

Related posts