telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భారీగా పడిపోయిన సునీల్ రెమ్యునరేషన్‌

Sunil

స్టార్ కమెడియన్‌గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. అప్పట్లో సునీల్ లేకుండా ఏ సినిమా ఉండేది కాదు. ఆ తర్వాత సునీల్ జాతకం మారిపోయి కమెడియన్‌ నుంచి హీరోగా ఎదిగిపోయాడు. కానీ కమెడియన్‌గా ఎంతో పేరు తెచ్చుకున్న సునీల్‌కి హీరో ఇమేజ్ సరిపోలేదు. మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చి ‘డిస్కో రాజా’ సినిమాతో విలన్‌గా కొత్త గెటప్ ఎత్తారు. ఈ సినిమాలో ఆయన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. అందుకే ఇక నుంచి విలన్‌గా ట్రై చేయాలని అనుకుంటున్నట్లు ఓ సందర్భంలో అన్నారు. అయితే సునీల్ సినీ కెరీర్‌లో మార్పులు వచ్చినట్లే ఆయన తీసుకునే రెమ్యునరేషన్‌లోనూ చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు హీరోగా చేస్తున్నప్పుడు రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకునేవాడట సునీల్. ఆ తర్వాత ఇమేజ్ పడిపోతూ రావడంతో ప్రస్తుతం ఏ సినిమా చేసినా కూడా రోజుకి రెండు లక్షలు తీసుకుంటున్నాడట. ఆ డబ్బు కూడా రోజంతా కాల్‌షీట్స్ ఇస్తేనే. లేకపోతే అందులోనూ కోతలు ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం సునీల్ ‘కలర్ ఫొటో’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో సునీల్ ఎస్సై రామరాజు అనే విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఆయన బర్త్‌డే సందర్భంగా లుక్ రివీల్ చేసారు. లుక్‌లో సీరియస్ పోలీసు అధికారిగా చాలా బాగా సరిపోయారు. దీంతో పాటు ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తున్న ఓ సినిమాలోనూ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

Related posts