telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పెట్రోలు సీసాతో కరోనా బాధితుడు హల్‌చల్!

petrol bottle

కర్ణాటకలో ఓ కరోనా బాధితుడు నిన్న పెట్రోలు సీసాతో హల్‌చల్ చేశాడు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు నానా హంగామా చేసిన ఘటన మాలూరు తాలూకాలో చోటుచేసుకొంది. నిడఘట్టహళ్లికి చెందిన వ్యక్తి బెంగళూరులోని ఆరోగ్య శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చిన అతడు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. విషయం తెలిసిన వైద్యాధికారులు హోం క్వారంటైన్ చేశారు. ఈ విషయాన్ని కొందరు అవకాశంగా తీసుకుని సోషల్ మీడియాలో తన గురించి తప్పుగా ప్రచారం చేస్తూ అవమానించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో

పెట్రోలు బాటిల్ తో గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని హల్‌చల్ చేశాడు. గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. తనపై దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే పెట్రోలు పోసుకుని అంటించుకుని, ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. విషయం తెలిసిన ఎమ్మెల్యే కేవై నంజేగౌడ గ్రామానికి చేరుకుని కిటికీలోంచి అతడితో మాట్లాడి నచ్చజెప్పారు. అతడు బయటకు రావడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Related posts