తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కు దూసుకెళ్లింది శృతి హాసన్. ఆ తరువాత రెండేళ్లు ప్రేమ కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇటీవలే ఆమె లవ్ బ్రేకప్ కావడంతో మళ్ళీ సినిమాలపై దృష్టి సారించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు తమిళం, హిందీలో ఒక్కో సినిమా చేస్తున్నారు. అలాగే తెలుగులో తాజాగా రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన క్రాక్ చిత్రంలో కూడా హీరోయిన్‌గా శ్రుతి నటించింది. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో సలార్ లో కూడా ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం అమ్మడి కిట్టీలో పలు సినిమాలు ఉన్నాయి. నటిగానే కాదు సింగర్ గా, మ్యూజిషియన్ గా సత్తా చాటుతూ వచ్చిన శ్రుతి ఇప్పుడు తన రచనకు కూడా పదును పెడుతోంది. ఇదిలా ఉంటే శ్రుతి ఇంత బిజీ షెడ్యూల్ లోనూ గత కొన్ని నెలలుగా స్క్రిప్ట్ రెడీ చేస్తూ వస్తోందట. అది పూర్తి కాగానే దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వాలనేది తన ప్లాన్. మరి శ్రుతి స్క్రిప్ట్ లో నటించేది ఎవరో చూద్దాం
previous post