telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘దిల్ బేచారా’కు రికార్డు స్థాయిలో వ్యూస్… రూ.950 కోట్లతో సమానం

Dil-bechara

దివంగత యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ నటించిన ఆఖరి చిత్రం ‘దిల్ బేచారా’కు సక్సెస్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం శుక్రవారం సాయంత్రం డిస్నీ+హాట్‌స్టార్‌ లో విడుదలై భారీ స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటోంది. ఓటీటీల్లో సినిమాలకు సంబంధించిన గణాంకాలను సేకరించి విశ్లేషించే సంస్థ ఓర్‌మ్యాక్స్‌ మీడియా కథనం మేరకు హాట్‌స్టార్‌ ద్వారా ప్రసారమైన ఈ చిత్రం 24 గంటల్లో తొమ్మిదిన్నర కోట్ల వ్యూస్‌తో రికార్డు నెలకొల్పి నట్టు తెలిపింది. 10/10 ఐఎండీబీ రేటింగ్‌ దక్కటంతో ఈ చిత్రం మరో రికార్డు సృష్టించింది. ‘దిల్ బేచారా ట్రైలర్‌ కూడా 24 గంటల్లో మూడున్నర కోట్ల వ్యూస్‌ను సాధించింది. ఈ చిత్రానికి వచ్చిన వ్యూస్ అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన వెబ్‌సిరీస్‌ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’తో పోల్చదగినదని పలువురి అభిప్రాయం. ‘దిల్ బేచారా’ సబ్‌స్కైబర్లు మాత్రమే కాకుండా అందరూ ఉచితంగా చూసే విధంగా డిస్నీ+ హాట్‌స్టార్‌ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ చివరి చిత్రాన్ని చూసేందుకు లక్షలాది అభిమానులు ఒక్కసారిగా ప్రయత్నించటంతో యాప్‌ సేవలు కొద్దిసేపు ఆగిపోగా ఆ తర్వాత చక్కదిద్దారు. ఓటీటీలో ఇంత సక్సెస్ అయిన ఈ సినిమా వచ్చిన వ్యూస్ ని కలెక్షన్ల రూపంలోకి మార్చితే 950 కోట్ల వసూళ్లు రాబట్టేదని విశ్లేషకులు చెబుతున్నారు. సుశాంత్‌ సింగ్‌ జూన్‌ 14న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

Related posts