telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ అభిమానులకు ఉగాది కనుక

రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తున్నాడు ప్రభాస్. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఉగాది కానుకగా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. అంతేకాదు అదే రోజు టైటిల్‌ను కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి. ఈ సినిమాకు ‘రాధేశ్యామ్’ అనే పేరు అనుకుంటున్నారు. గతేడాది ఈయన హీరోగా నటించిన ‘సాహో’ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మొత్తంగా ప్రభాస్ కొత్త సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related posts