telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

విజయనగరం : … సినీ గేయ రచయిత రామజోగయ్యశాస్త్రికి .. గురజాడ విశిష్ట పురస్కారం ..

ramajogayya got gurajada award

గురజాడ 104వ వర్ధంతిని పురస్కరించుకుని విజయనగరం గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 30న సమాఖ్య సభ్యులు పురస్కారం అందజేయనున్నారు. సినీ గేయ రచయిత, సాహితీవేత్త రామజోగయ్యశాస్త్రి గురజాడ విశిష్ట పురస్కారానికి ఎంపికయ్యారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు పీవీ నరసింహరాజు, కాపుగంటి ప్రకాష్‌లు ఈ విషయాన్ని తెలిపారు.

పురస్కార ప్రదానోత్సవంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, నటుడు, రచయిత తనికెళ్ల భరణి ప్రధాన వక్తగా పాల్గొంటారని చెప్పారు. సాయిఫౌండేషన్‌ అధ్యక్షుడు, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పురస్కార ప్రదాతగా వ్యవహరిస్తారన్నారు.

Related posts