telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గ్రామాల అభివృద్ధిపై తెలంగాణ సర్కార్ ఫోకస్.. సీఎస్ ఆదేశాలు

రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్ధానిక సంస్ధలు), డిఎఫ్ఓలు, డిపిఓ లు, డిఆర్ డిఓ లు, మున్సిపల్ కమీషనర్లు ఇతర అధికారులతో స్ధానిక సంస్ధల నిర్వహణ పనితీరులో మెరుగుదల, తెలంగాణకు హరితహారం, ధరణి, వ్యాక్సినేషన్ లపై బిఆర్ కె.ఆర్ భవన్ నుండి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి విజన్ మేరకు అధికారులు పనిచేయాలని స్ధానిక సంస్ధలలో ఆకస్మీక తనిఖీలు నిర్వహించాలని, గ్రామాలలో రాత్రి బసలు చేసి పారిశుధ్ధ్యం ఇతర అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

 

పారిశుద్ధ్యం, పచ్చదనం, గ్రామ సభల నిర్వాహణ, ప్రగతి నివేధికల తయారి సీజనల్ క్యాలండర్ తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు.  రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామాత్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ నుండి వీడియోకాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

 

రిజర్వు ఫారెస్ట్ బ్లాక్ లలో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం, జిల్లాలలో అన్ని రహదారుల వెంట మల్టీలెవల్ ఎవెన్యూ ప్లాంటేషన్, పట్టణాలలో ఖాళీస్ధలాలలో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం, నూతనంగా నిర్మిస్తున్న జిల్లా సమీకృత కార్యాలయ కాంప్లెక్సులలో పచ్చదనం, తదితర అంశాలను సమీక్షించారు. మొక్కలు నాటడానికి గుంతల తవ్వకం, మిగిలిన గ్రామాలలో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటును పూర్తి చేయాలని కలెక్టర్లను కోరారు.

 

 ధరణిలో పెండింగ్ ధరఖాస్తుల పరిష్కారం స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు, వెజ్, నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకు స్ధలాలు అప్పగించడం తదితర అంశాలను చర్చించారు. వ్యాదుల కంట్రోల్ పై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు

Related posts