telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

టెర్రరిస్టు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు .. పాక్ లోనే.. పట్టిస్తే 7 కోట్ల బహుమతి : అమెరికా

trump new policies on h1b visa

పుల్వామా ఘటనతో భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం అలుముకుంది. ఎటు చూసినా దేశప్రజలు కూడా ఎప్పుడు దాయాది దేశంలో తలదాచుకున్న ఉగ్రభూతం నాశనం అవుతుందా అంటూ.. కోపోద్రేకాలతో ఊగిపోతున్నారు. దీనిపై ప్రపంచదేశాలు కూడా స్పందించి, భారత్ కు మద్దతు పలుకుతున్నాయి. దీనితో ఇప్పటికే ఉగ్రదేశంగా ముద్రపడిన పాక్ ప్రపంచ మ్యాప్ లో ఒంటరిది అయిపోయింది. ఎప్పటి నుండో తమ దేశంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాలనీ

భారత్ సహా పలుదేశాలు సూచిస్తున్నా, వాటితో భారత్ పై పగ తీర్చుకోవచ్చనే ఉద్దేశ్యంతో వాటిని పాక్ పెంచి పోషిస్తున్న విషయం ప్రపంచదేశాలకు తెలిసిన రహస్యం. తాజాగా, దాడితో భారత్ సహనం కోల్పోయి, తగిన చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించింది. దీనితో ప్రపంచ దేశాలు స్పందించి, పాక్ పై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంటర్నేషనల్ టెర్రరిస్టు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్, ప్రస్తుతం పాకిస్థాన్ లోనే తలదాచుకున్నాడని తెలిసింది.

అప్పట్లో అగ్రరాజ్యం మట్టుపెట్టిన ఉగ్రవాది బిన్ లాడెన్ కుమారుడు తమకు ఏమైనా హాని చేస్తాడేమో అనే భయం ఆ దేశానికీ పట్టుకున్నట్టే ఉంది. దీనితో ఆ సమాచారం తెలియగానే అతడి ఆచూకీ చెబితే మిలియన్ డాలర్లు (సుమారు రూ. 7.16 కోట్లు) రివార్డు ఇస్తామని అమెరికా ప్రకటించింది. హంజా బిన్ లాడెన్ ప్రస్తుతం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉండివుండవచ్చని అక్కడ లేకుంటే ఇరాన్ లో ఉండివుంటాడని అనుమానం వ్యక్తం చేసిన అమెరికా, అతన్ని పట్టించినా లేదా ఆచూకీ చెప్పినా బహుమతి ఇస్తామని వెల్లడించింది. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్రటరీ మైఖైల్ ఇవనాఫ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

అల్ ఖైదాకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని, లాడెన్ ను మట్టుబెట్టిన తరువాత ఉగ్ర సంస్థకు హంజా బిన్ లాడెన్ నాయకుడయ్యాడని అన్నారు. ఇంటర్నెట్ లో అతని ఆడియో, వీడియో సందేశాలు వస్తున్నాయని గుర్తు చేశారు. కాగా, జనవరి 2017లో హంజా బిన్ ను అంతర్జాతీయ తీవ్రవాదిగా అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Related posts