telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మాస్క్ ఇంట్లో ఉన్నా ధ‌రించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసిన కేంద్రం…

mask corona

కేంద్ర ప్రభుత్వం కరోనా పై కీల‌క సూచ‌న‌లు చేసింది. అయితే ప్రస్తుతం దేశంలో రోజుకు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. కాబట్టి ఈ స‌మ‌యంలో సాధార‌ణ ల‌క్ష‌ణాలున్నా కోవిడ్ బాధితులేన‌ని తెలిపిన కేంద్రం… మాస్క్ ధ‌ఇంట్లో ఉన్నా రించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది.. మ‌రోవైపు.. ఇది కోవిడ్ స‌మ‌యం.. కాబ‌ట్టి మీ ఇళ్ల‌కు ఎవ్వ‌రినీ రానియొద్దు.. మీరు కూడా అన‌వ‌స‌రంగా ఎక్క‌డికి వెళ్లొద్ద‌ని సూచించింది. ప్రజలు తమ ఇళ్లలో కూడా ముసుగులు ధరించడం ప్రారంభించాల్సిన సమయం ఇది” అని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ చెప్పారు. పెరుగుతున్న అంటువ్యాధుల దృష్ట్యా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోని ఆస్ప‌త్రులు ఆక్సిజన్ మరియు బెడ్ల కొరతతో ఇబ్బంది ప‌డుతున్నాయ‌న్న ఆయ‌న‌.. ఆక్సిజన్ సంక్షోభం దృష్ట్యా, రెమ్‌డెసివిర్ మరియు టోసిలిజుమాబ్ వంటి మందుల మాదిరిగానే ఆక్సిజన్‌ను హేతుబద్ధంగా ఉపయోగించడం ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Related posts