telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ : .. బాస్ కి కోపం వచ్చే.. శిక్షలు విచిత్రాలు..

bigg boss punishments to house mates

తాజా ఎపిసోడ్‌ లో అలీ రాజా, పున‌ర్న‌విల‌కి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. టాస్క్‌లో భాగంగా వారిద్ద‌రు సీక్రెట్ రూంలో ఉన్నారు. వారిద్ద‌రు బ‌య‌ట‌కి రావాలంటే హౌజ్ మేట్స్ ఇంట్లో చెప్పులు వేసుకోకూడ‌దు, భోజ‌నంలో పెరుగు ఉండ‌ద‌ని చెప్పారు. వాటితో పాటు మ‌గ‌వాళ్ళ నాలుగు మ్యాట్రిసెస్‌, ర‌వికి ఇచ్చినవి కాకుండా పాలు, గుడ్లు స్టోర్ రూంలో పెట్టాల‌ని బిగ్ బాస్ ఆదేశించారు. ఆయ‌న ఆదేశాల ప్ర‌కారం మెజారిటీ స‌భ్యులు వాటిని ఫాలో అయ్యేందుకు ఆస‌క్తి చూపించారు. దీంతో బిగ్ బాస్ ఆ వ‌స్తువుల‌న్నింటిని స్టోర్ రూంలో పెట్ట‌మని చెప్ప‌డంతో పాలు , పెరుగు, చెప్పులు, గుడ్లు అన్నింటిని స్టోర్ రూంలో పెట్టారు.

సీక్రెట్ రూంలో ఉన్న అలీ, పునర్న‌వికి బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. వారు ఇంటి స‌భ్యుల‌తో ఉన్న డార్ట్ బోర్డ్‌పై బాణం గుచ్చి వారు ఎందుకు న‌చ్చ‌లేదో కార‌ణం వివ‌రించాల‌ని చెప్పారు. దీంతో పున‌ర్న‌వి ముందుగా హిమ‌జ‌ని ఎంపిక చేసుకొని త‌న‌కి న‌చ్చ‌క పోవ‌డానికి గ‌ల కార‌ణం వివ‌రించింది. ఆ త‌ర్వాత శ్రీముఖి, వితిక, రాహుల్‌, బాబా భాస్కర్ ఫోటోల‌పై బాణం గుచ్చి వారు న‌చ్చ‌క‌పోవ‌డానికి గ‌ల రీజ‌న్ చెప్పింది. ఇక అలీ త‌న‌కు మ‌హేష్ విట్ట‌, త‌మ‌న్న, వితిక న‌చ్చ‌లేద‌ని అన్నాడు… వీట‌న్నింటిని లివింగ్ రూంలో కూర్చున్న ఇంటి స‌భ్యులు వీక్షిస్తూ ర‌క‌ర‌కాల హావ‌భావాలు ప్ర‌ద‌ర్శించారు. ఆ త‌ర్వాత వెల్ క‌మ్ టూం ద పార్టీ సాంగ్ ప్లే కావ‌డంతో పాటు సీక్రెట్ రూం డోర్స్ తెర‌చుకున్నాయి. దీంతో అలీ, పునర్న‌వి మ‌ళ్ళీ త‌మ ఫ్రెండ్స్‌ని క‌లిసి తెగ ఆనంద‌ప‌డ్డారు.

సీక్రెట్ టాస్క్ అలీ, పునర్న‌వి స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయ‌డంతో వారిద్ద‌రికి ఇమ్యునిటి లభించింద‌ని బిగ్ బాస్ చెబుతూ, వ‌చ్చే వారం వారు నామినేష‌న్‌లో ఉండ‌ర‌ని పేర్కొన్నారు. ఇక సీక్రెట్ రూంని ఇంటి స‌భ్యుల‌కి గిఫ్ట్‌గా ఇస్తున్న‌ట్టు తెలియ‌జేసిన బిగ్ బాస్ .. దానిని వాడుకోవ‌చ్చ‌ని తెలిపారు. ఆ త‌ర్వాత బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కి స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇచ్చారు. వారు ఇంట్లో ఉల్లంఘించిన నియమాల‌ని చూపించిన త‌ర్వాత శిక్ష‌లు విధించారు. ముఖ్యంగా కెప్టెన్‌గా ఉన్న వ‌రుణ్ సందేశ్ త‌న బాధ్య‌త‌ల‌ని నిర్వ‌ర్తించ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. ఇందుకుగాను ఆయ‌న ఇంకో సారి కెప్టెన్ అయ్యే అవ‌కాశాన్ని కోల్పోయాడు. అంతేకాక శిక్షగా వరుణ్ సందేశ్‌ను సర్వర్‌గా మారాలి అని చెప్పారు.

ఇంట్లో నుంచి ఎవరు బయటికి వెళ్లినా, లోపలికి వచ్చినా వరుణ్ డోర్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇంటి స‌భ్యులు ఏం చెపితే అది చేయాలి. ప్లేట్స్‌ క‌డ‌గాలి. అలాగే ఆహారం కూడా ఇంటి సభ్యులకు వరుణ్ సందేశ్ అందించాల్సి ఉంటుందని చెప్పారు. గుంపులుగా స్మోకింగ్ రూంలో ఉన్న బాబా భాస్క‌ర్, అలీ, మ‌హేష్ విట్ట‌, వ‌రుణ్‌, శ్రీముఖిల‌కి కూడా బిగ్ బాస్ శిక్ష విధించారు. డ్ర‌మ్‌కి హోల్స్ పెట్టి అందులో నీరు పోకుండా త‌మ వేలుతో ఆపాల‌ని ఆదేశించారు. ఇక మైకులు పెట్టుకోకుండా, ఊరికే నిద్రిస్తున్న త‌మ‌న్నా, అషూ రెడ్డి, వితిక‌, రోహిణిల‌కి బిగ్ బాస్ ఆదేశం వ‌చ్చిన ప్ర‌తి సారి స్మిమ్మింగ్ పూల్‌లో మున‌గాల‌ని చెప్పారు. బిగ్ బాస్ ఆదేశాల ప్ర‌కారం ఇంటి స‌భ్యులు త‌మ‌కి ఇచ్చిన శిక్ష‌ల‌ని స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. కొద్ది సేప‌టి త‌ర్వాత వారి శిక్ష‌ల‌కి విముక్తి క‌లిపించాడు బిగ్ బాస్. ఇక నేడు శ‌నివారం కావ‌డంతో నాగార్జున‌తో క‌లిసి ఇంటి స‌భ్యులు సంద‌డి చేయ‌నున్నారు. వారి చేసే ఫ‌న్ బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Related posts