శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ విద్యా సంస్థల యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ లాంటి యువ నటుడితో భాగస్వామ్యం ద్వారా తమ విద్యాసంస్థలకు మరింత పేరు ప్రఖ్యాతలు లభిస్తుందని యాజమాన్యం పేర్కొంది. యూత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం వల్ల తమ సంస్థలకు ఉన్న బ్రాండ్ వ్యాల్యూ మరింత పెరుగుతుందనే నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీ చైతన్య విద్యా సంస్థల మేనేజ్‌మెంట్ వెల్లడించింది. మరోవైపు శ్రీచైతన్య విద్యాసంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడంపై అల్లు అర్జున్ సైతం హర్షం వ్యక్తం చేశారని ఓ సంస్థ తెలిపింది.
సినిమాలు విషయానికొస్తే.. అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు.శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. బన్నీ ఇందులో పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. దీనిలో మొదటి భాగం పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న విడుదలవుతుంది. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ అయితే, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు