telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చంద్రయాన్-2 : సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్… ఇట్స్ ఎ జర్నీ… మహేష్ ట్వీట్

Mahesh-Babu

చంద్ర‌యాన్ రాకెట్ ప్ర‌యోగంతో ప్ర‌పంచ‌దేశాల‌ను ఇండియా త‌న వైపు తిప్పుకునేలా చేసింది. అంతా సవ్యంగా జరిగిపోతోంది. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టడం ఖాయం అనుకున్నారు. కానీ కేవలం చంద్రుడికి 2.1 కిమీ దూరంలో ఇస్రోకు, విక్రమ్ ల్యాండర్ కు కమ్యూనికేషన్ కట్ అయింది. దీనితో ఇస్రో శాస్త్రవేత్తలంతా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఇస్రో చైర్మన్ శివన్ ప్రధాని మోడీని కౌగిలించుకుని కంటతడి పెట్టుకున్నారు. ఈ దృశ్యాలు దేశ ప్రజలందరినీ కలచి వేశాయి. ఇస్రో గొప్ప ప్రయత్నం చేసింది. విక్రమ్ ల్యాండర్ కమ్యూనికేషన్ కట్ అయినప్పటికీ ఇది విజయమే. శాస్త్రవేత్తల కృషి మరువలేనిది అంటూ ప్రజలు, సినీ రాజకీయ ప్రముఖులు ఇస్రోకు అండగా నిలుస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులంతా ఇస్రో శాస్త్రవేత్తల కృషిని కొనియాడుతూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ప్రయోగం చివరి వరకు విజయవంతంగానే కొనసాగింది. చివర్లో నిరాశపరిచినప్పటికీ ఇస్రో శాత్రవేత్తల పడ్డ శ్రమ మరిచిపోలేనిది. దీనితో సెలెబ్రిటీలు ఇస్రోకు మద్దతుగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ట్విట్ చేశాడు. ఇస్రో శాత్రవేత్తలని అభినందిస్తూ మహర్షి చిత్రంలోని డైలాగ్ గుర్తుచేసుకున్నాడు. “సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్.. ఇట్స్ ఎ జర్నీ.. చంద్రయాన్ 2 ద్వారా ఇస్రో చారిత్రాత్మక జర్నీ కొనసాగించింది. ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయిన ప్రతి సైంటిస్ట్ కు సెల్యూట్ చేస్తున్నా.. మీరే నిజమైన హీరోలు. మేమంతా మీతో ఉన్నాం. విజయానికి ఇది ఆరంభం మాత్రమే” అని మహేష్ ట్విట్టర్ లో స్పందించాడు.

Related posts