telugu navyamedia
సినిమా వార్తలు

మరో బాలీవుడ్ జంట విడాకులు

IMran-KHan

సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉత్తరాది స్టార్లు ప్రేమ‌, పెళ్లి ఆ త‌ర్వాత విడాకులు తీసుకుంటుంటారు. తాజాగా “జానే తు యా జానే నా” సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్ త‌క్కువ స‌మ‌యంలోనే ల‌వ‌ర్ బోయ్‌గా క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇమ్రాన్ తాను 8 ఏళ్ళుగా ప్రేమించిన అవంతిక మాలిక్‌ని జ‌న‌వ‌రి 10, 2011న పెళ్ళి చేసుకున్నాడు. 2014లో వీరికి ఓ పాప కూడా జ‌న్మించింది. అయితే పెళ్లైన మొద‌ట్లో వీరి సంసారం స‌జావుగానే సాగింది. కానీ ఆ త‌ర్వాత హీరోగా అవ‌కాశాలు లేక‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కూడా అవ‌కాశాలు కరువ‌వ్వ‌డంతో ద‌ర్శ‌కుడిగా మారాడు ఇమ్రాన్‌. అయితే ప్రొఫెష‌న‌ల్ లైఫ్ అంత బాగోలేక‌పోవ‌డంతో ఆ ఒత్తిడిని త‌న భార్య‌పై చూపించాడ‌ట‌. ఈ క్రమంలో ఇద్ద‌రి మ‌ధ్య మనస్పర్థలు రావడంతో అవంతిక తన ఐదేళ్ల కూతురుని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయిందట. ఇమ్రాన్ సొంత మావ‌య్య, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వారిద్దరికి నచ్చ‌జెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదట. ఇక వారిద్ద‌రు విడాకులు తీసుకోవ‌డం ఖాయమ‌ని బీ టౌన్ టాక్.

Related posts