telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

‘సలార్’ లో ప్రియాంక…

ప్రస్తుతం ఇండియాలోనే టాప్ హీరోల్లో ఒకడు ప్రభాస్. అయితే ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున విషయం తెలిసిందే. అందులో సలార్ కూడా ఒకటి. ఇక బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్‌ లో ప‌లు వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ బిజీబిజీగా మారింది. పలు చిత్రాల్లో ఐటెం సాంగ్‌తో అలరించిన ప్రియాంక ఇప్పుడు ‘స‌లార్‌’లో ప్ర‌భాస్‌తో క‌లిసి చేయనుందని గత కొద్దిరోజులుగా వినిపిస్తున్న గాసిప్ వార్త. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా అయితే సలార్ కి చాలా బాగా కలిస్తోందని చిత్రబృందం భావిస్తోందట. ఇక రెమ్యూనరేషన్ విషయంలోను ఓ లెక్క కుదిరిందని టాక్. చాలా తక్కువ టైమ్ లోనే ప్రియాంకపై స్పెషల్ సాంగ్ ను తీయనున్నారట. కాగా, తాజాగా ‘సలార్’ మొదటి షెడ్యూల్ గోదావరిఖని ప్రాంతంలో ముగించుకుంది. ‘కేజీయఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం కావడం, బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ నటిస్తుండటంతో సలార్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. చూడాలి మరి ఈ సినిమా ఎప్పటికి విడుదల అవుతుంది అనేది.

Related posts