telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్‌లో ఐటీ పురోగతి : కేటీఆర్

KTR TRS Telangana

హైదరాబాద్ లో ఐటీ పురోగతి గత నాలుగేళ్లుగా బాగుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉప్పల్‌లో జరిగిన హైదరాబాద్ గ్రిడ్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఐటీ వృద్ధిలో జాతీయ సగటు కంటే తెలంగాణ సగటు ఎక్కువగా ఉందన్నారు. తూర్పువైపున ఉప్పల్ వైపు నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.

నగరం లోపల ఉన్న పరిశ్రమలను నగరం వెలుపలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.ఎంఎంటీఎస్‌ను రాయగిరి వరకు పొడిగించే ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలంటే నగరం నలువైపులా సమానంగా అభివృద్ధి చెందాలన్నది కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. నగరంలో మౌలిక సదుపాయాలతోపాటు వ్యాపారఅవకాశాలు కూడా పెరగాల్సి ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.

Related posts