telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సెక్రెటేరియట్ కూల్చివేతపై స్టే పొడిగింపు!

secretariate atelangana hyd

తెలంగాణ సెక్రెటేరియట్ భవనాల కూల్చివేతపై గతంలో ఇచ్చిన స్టేను రేపటి వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే దీనిపై విచారణను రేపటికి వాయిదా వేసింది. సచివాలయ కూల్చివేతకు ముందస్తు పర్యావరణ అనుమతులు తీసుకోలేదన్న పిటిషనర్ పీఎల్ విశ్వేశ్వరరావు తరపు న్యాయవాది ప్రభాకర్ వాదనను అడ్వకేట్ జనరల్ ప్రసాద్ ఖండించారు.

కూల్చివేతకు పర్యావరణ అనుమతి అవసరం లేదన్నారు .ఆయన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. నిర్మాణానికి భూమిని సిద్ధం చేసేందుకు పర్యావరణ అనుమతి అవసరమని, కూల్చివేయడమంటే నిర్మాణానికి తిరిగి భూమిని సిద్ధం చేయడమేనని కోర్టు పేర్కొంది. నిర్మాణ సమయంలో పర్యావరణ అనుమతులు తీసుకుంటామని ఏజీ కోర్టుకు తెలిపారు. దీంతో పర్యావరణ అనుమతిపై కేంద్రం రేపు వివరణ ఇవ్వాలని తెలిపింది. ప్రభుత్వ వాదనకు బలం చేకూర్చే తీర్పులుంటే సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

Related posts