టాలీవుడ్ లోకి మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడిగా ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్ దేవ్. మొదటి చిత్రం ‘విజేత’ కు మంచి టాక్ వచ్చినప్పటికీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకే ఎలాగైనా హిట్టు కొట్టాలని ‘సూపర్ మచ్చి’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇది పూర్తయిన వెంటనే.. మరో రెండు సినిమాలు చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. నాగశౌర్యతో ‘అశ్వద్ధామ’ వంటి యావరేజ్ చిత్రాన్ని తెరకెక్కించిన రమణ్ తేజ వినిపించిన స్క్రిప్ట్ కు కళ్యాణ్ దేవ్ ఓకే చేసాడు. నేడు దీపావళి సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి ”కిన్నెరసాని” అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ‘కిన్నెరసాని’ టైటిల్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. టైటిల్ పోస్టర్ ను సముద్రపు ఒడ్డు ఒక పుస్తకానికి గొలుసుతో తాళం వెయ్యడం వంటి ఎలిమెంట్స్ జోడించి డిజైన్ చేసారు. ‘కల్కి’ వంటి హిట్ చిత్రానికి స్టోరీ అందించిన దేశరాజ్ సాయి తేజ్ ”కిన్నెరసాని” చిత్రానికి కథను అందిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది… ఎటువంటి టాక్ ప్రజలనుండి తెచ్చుకుంటుంది అనేది.
previous post
next post
సీఎం జగన్ హామీలు చేతల్లో చూపించాలి: కన్నా