ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని నరేంద్రమోదీ నేడు భేటీ కాబోతున్నారు. ఢిల్లీ శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి ప్రధానిని కలుసుకోవడం ప్రాధాన్యతను సంచరించుకొంది.
ఇటీవల ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో వీరి కలయిక లో అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కాగా, ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో గతవారం అమిత్‌షాను కలిసిన కేజ్రీవాల్ పరిస్థితిపై చర్చించారు.