telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

జగన్, కెసిఆర్ లకు ప్రధాని మోడీ ఫోన్…

Modi Mask

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రధానమంత్రి మోడీ ఆరా తోశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, తెలంగాణ సీఎం కెసిఆర్ లతో తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ప్రధానమంత్రి మోడీ. ఈ విషయాన్నీ స్వయంగా మోడీ తన ట్విట్టర్ వేదికగా చెప్పారు. అవసరమైన సహాయం అందించేందుకు, పునరుద్ధరణ చర్యలు చేపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి మోడీ పేర్కొన్నారు. అటు వాయుగుండం తీరం దాటినందున ఇబ్బంది లేదని..అయినా పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాగా..హైదరాబాద్ లో నిన్నటినుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ కు వర్ష పోటెత్తింది. దాంతో పూర్తిస్థాయి నీటి మట్టం దాటేసింది హుస్సేన్ సాగర్.

అయితే హుస్సేన్ సాగ‌ర్ పూర్తి స్థాయి నీటి మ‌ట్టం 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం హుస్సేన్ సాగ‌ర్ లో 513.70 మీటర్లకు నీరు చేరింది. అటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలో వరద పెరిగింది.. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో.. ఇప్పటికే శ్రీశైలం డ్యామ్‌ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్‌ 10 క్రస్టు గేట్లు 15 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ 213.8824 టీఎంసీలుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.70 అడుగులకు చేరింది.

Related posts