telugu navyamedia
రాజకీయ

మమతకు వణుకు పుడుతోంది: ప్రధాని మోదీ

pm modi fire pulvama terror attacks
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శనాస్త్రాలు సందించారు. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రధాని మోదీ ఇవాళ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి రోజురోజుకు పెరుగుతున్న జనాదరణ చూసి మమతకు వణుకు పుడుతోందనీ వ్యాఖ్యానించారు.  బీజేపీ ఆధారణను చూసి ఆమె తమ పార్టీ కార్యకర్తలపై వేధింపులకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు.  కష్టాల్లో ఉన్న రైతులను రుణమాఫీతో పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రతిపక్షాలపై ఆయన విమర్శలు కురిపించారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదంపైనా మోదీ స్పష్టమైన వైఖరి వెల్లడించారు. 
మత ఘర్షణల కారణంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి పారిపోయి వచ్చిన నాన్ ముస్లిం మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పించే ఉద్దేశ్యంతో కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. కాగా ప్రధాని పాల్గొన్న ఈ ర్యాలీకి ఎస్సీ వర్గానికి చెందిన వారు పెద్ద ఎత్తున తరలిరావడం విశేషం. వారిని చూసి మరింత ఉత్సాహంతో మాట్లాడిన మోదీ. ఆమె పార్టీ ఎందుకు హింసాకాండకు పాల్పడుతున్నారో ఇప్పుడు నాకు అర్థమైందన్నారు. మీరు మాపై చూపిస్తున్న ఆదరణ చూసి ఆమెకు వణుకు పుడుతోందన్నారు.కాగా నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ చారిత్రాత్మకమైనదనీ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నిర్లక్ష్యానికి గురైన ప్రతి వర్గానికి మేలు జరుగుతుందని మోదీ అన్నారు. 

Related posts