#Hyderabad ఆర్థికమంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీ సమావేశమైంది. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థిక, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, పురపాలక, ఐటీ, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఆదాయం పెంపు మార్గాలపై తెలంగాణ రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది. నిధుల సమీకరణపై అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చించి, వివిధ స్టేక్ హోల్డర్స్‌తో సంప్రదింపుల తర్వాత సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పించాలని ఉప సఘం నిర్ణయించింది. కరోనా సెకండ్ వేవ్, లాక్‌డౌన్‌తో ఖజానాకు రావాల్సిన ఆదాయం భారీగా తగ్గింది. ఒక్క మే నెలలోనే 4,100 కోట్ల ఆదాయం కోల్పోయినట్టు రాష్ట్ర ప్రభత్వం ఇటీవల కేంద్రానికి తెలిపింది. ఈ టైములో నిధుల సేకరణ కోసం ప్రభుత్వం గృహనిర్మాణ సంస్థ వద్ద నిరుపయోగంగా ఉన్న భూములు విక్రయించాలని ఇప్పటికే నిర్ణయించింది. హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ భూముల వేలానికి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది.
previous post
పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోను: చంద్రబాబు