telugu navyamedia
తెలంగాణ వార్తలు

దేశాన్ని న‌డిపే డ‌బులు ఇంజ‌న్ అంటే మోదీ -ఈడీ అని ఇప్పుడే గ్ర‌హించాం..

*బండి సంజ‌య్‌పై మంత్రి కేటీఆర్ సెటైర్లు
*దేశాన్ని న‌డిపే డ‌బులు ఇంజ‌న్ మోదీ -ఈడీ అని ఇప్పుడే గ్ర‌హించాం..

*ఈడీ చీఫ్​గా బండిని నియమించినందుకుమోదీకి ధన్యవాదాలు

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ ను ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్‌ గా కూడా నియమించినందుకు ప్ర‌దాని మోదీకి ధన్యవాదాలు అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

కేసీఆర్​ కూడా ఈడీ, సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధానిని ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.దేశాన్ని నడిపే డబుల్ ఇంజన్ అంటే మోడీ- ఈడీ అని మాకు ఇప్పుడు అర్ధమైందని మంత్రి కేటీఆర్ అన్నారు.

మరో ట్వీట్‌‌లో భారత్‌లో రెండు వాస్తవాలు జరిగాయని అన్నారు. ప్రపంచ పేదరిక రాజధానిగా భారతదేశం… నైజీరియాను అధిగమించిందని విమర్శించారు… ఇదే సమయంలో ఆదానీ బిల్ గేట్స్‌ను దాటి మరీ ప్రపంచంలోనే నాలుగో ధనవంతుడయ్యారని పేర్కొన్నారు.

మోదీ ప్రభుత్వ ప్రాధాన్యాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. ఒకవైపు, మోదీ ప్రభుత్వం కార్పొరేట్ పన్నులను ఏడాదికి 1.45 లక్షల కోట్ల రాయితీ ఇచ్చింది. మరోవైపు, బియ్యం, పెరుగు, గోధుమ, మజ్జిగ లాంటి సామాన్యుడి నిత్యావసరాలపై పన్నులను పెంచింది. కార్పొరేట్లకు ట్యాక్స్ కట్, కామన్ మ్యాన్‌పైన ట్యాక్స్ హైక్’’ అంటూ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు

రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు కేటీఆర్ ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, తెలంగాణలో గిరిజనుల రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఆటవీహక్కుల చట్టం సవరణ బిల్లు ఆమోదం పొందుతుందని ట్వీట్ చేశారు.

Related posts