telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

హైదరాబాద్ పోలీస్ : రక్షణ కోసం.. రౌడీషీటర్స్‌ మాడ్యూల్‌ యాప్‌..

hyderabad police new app for security

హైదరాబాద్‌ పోలీసులు నగర ప్రజలకు మరింత సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు సరికొత్త రౌడీషీటర్స్‌ మాడ్యూల్‌ యాప్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నమోదైన ప్రతి రౌడీ షీటర్‌కు సంబంధించిన ఫొటో, అతని కుటుంబ, వ్యక్తిగత వివరాలు, ఫోన్‌ నంబర్లు, అతనిపై నమోదైన కేసుల వివరాలు.. ఇలా ప్రతి అంశాన్ని ఈ యాప్‌లో పొందుపర్చారు.

ఈ యాప్‌ను టీఎస్‌కాప్‌ వెబ్‌ సర్వీస్‌లో పొందుపర్చడంతో హైదరాబాద్‌ నగరానికి సంబంధించిన రౌడీషీటర్ల వివరాలను ప్రతి పోలీస్‌ అధికారి ఒక్క క్లిక్‌తో చూసుకోవచ్చు. అంతేకాకుండా రౌడీషీటర్ల ఇంటిని జియో ట్యాగింగ్‌ చేయడంతో గస్తీ నిర్వహించే పోలీస్‌ అధికారి ఈ యాప్‌తో జియో ట్యాగింగ్‌ లొకేషన్‌తో అతని ఇంటికి చేరుకోవచ్చు. పోలీస్‌ స్టేషన్‌ల వారీగా రౌడీషీటర్ల వివరాలను ఈ యాప్‌ లో చేర్చారు.

ఈ యాప్‌లోకి లాగిన్‌ అయ్యి పేరు నమోదు చేసుకున్న పోలీసు అధికారులు రౌడీల డేటాను మొత్తం చూసుకోవచ్చు. ఈ యాప్‌ వల్ల రౌడీషీటర్లు వేరే ప్రాం తాల్లో ఏమైనా నేరాలకు పాల్పడినా, గొడవలకు దిగినా అక్కడి పోలీసులు అతని గత చరిత్ర ఈ రౌడీ షీటర్స్‌ మాడ్యూల్‌ యాప్‌లో తెలుసుకోవచ్చు. ఈ రౌడీషీటర్స్‌ మాడ్యూల్‌ యాప్‌ను బషీర్‌బాగ్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్‌, అదనపు సీపీ క్రైమ్స్‌ అండ్‌ సిట్‌ షికా గోయెల్‌, సీనియర్‌ ఐపీఎస్‌ అ ధికారులు డీఎస్‌ చౌహాన్‌, తరుణ్‌జోషి, డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

Related posts