telugu navyamedia
రాజకీయ వార్తలు

మమత సోనియాకు లేఖ అందుకే రాసిందా…?

మమత బెనర్జీ, నిన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాకు లేఖ రాశారు. అందరం కలిసి బీజేపీని ఎదుర్కొనాలని సోనియాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.  బెంగాల్ లో రెండో విడత ఎన్నికలకు ముందు సోనియాకు మమత రాసిన లేఖ హాట్ టాపిక్ గా మారింది.  ఎన్నికల తరువాత అవసరమైతే కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలను కూడా కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మమత సిద్ధంగా ఉన్నట్టు లేఖ ద్వారా తెలుస్తోంది.  గత ఎన్నికల్లో 200 లకు పైగా స్థానాల్లో విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు భయపెడుతుందా? కీలక నేతలు పార్టీని వదిలి బీజేపీలో చేరడంతో పార్టీ ముందుగానే ఓటమిని గ్రహించి అన్ని పార్టీలు కలిసి బీజేపీపై యుద్ధం చేయాలని నిర్ణయం తీసుకుందా? 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మూడు సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 18 ఎంపీ స్థానాలు గెలుచుకోవడానికి కారణం ఏంటి? 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధిస్తామని బీజేపీ నేతలు మొదటి నుంచి చెప్తున్నారు. పైగా తృణమూల్ నుంచి సీనియర్లు, కీలక నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకోవడంతో తృణమూల్ పార్టీ కొంత బలహీనపడింది.  కోల్పోయిన బలాన్ని తిరిగి తెచ్చుకోవడానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అవసరమైతే కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపేందుకు లేఖ రాసిందా… అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Related posts