సీఎం జగన్‌ని తూర్పుగోదావరి జిల్లా మండపేట వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోట త్రిమూర్తులు మర్యాద పూర్వకంగా కలిశారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట కుమారుడు తోట పృద్వీరాజ్ కూడా ఉన్నారు. గవర్నర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో కొత్తగా లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), ఆర్వీ రమేష్‌కుమార్ (వైఎస్సార్ కడప), మోషేన్‌రాజు (పశ్చిమ గోదావరి), తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి) ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టనున్నారు. కాపులకు తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు. సీఎం జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే (ఆంగ్లో ఇండియన్) ఫిలిప్ సి థాచర్ వైఎస్సార్‌సీపీలోకి చేరారు. సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి.. ఆయన సమక్షంలో పార్టీలోకి చేరారు. ఫిలిప్ సి. థోచర్‌కు సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
previous post