telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రానాకు శస్త్ర చికిత్స నిజమే… స్పందించిన సురేష్ బాబు

Rana

బాహుబ‌లి చిత్రంలో భ‌ళ్ళాల‌దేవ పాత్ర‌తో దేశవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్న రానా ద‌గ్గుబాటి తెలుగులో “విరాట ప‌ర్వం” అనే సినిమాతో రానా బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. మరోవైపు హౌస్‌ఫుల్ ఫ్రాంచైజ్‌లో భాగంగా తెరకెక్కుతున్న “హౌస్‌ఫుల్-4” చిత్రంలో పవర్ ఫుల్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరో వైపున తమిళ, హిందీ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రానా ఇప్పుడు తెలుగులో “విరాటపర్వం”, “హిరణ్యకశ్యప”తో పాటు హిందీలో “హాథీ మేరే సాథీ” సినిమాల్లో నటిస్తున్నారు. యాడ్స్ లోను నటిస్తున్నాడు. రానా ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడనే ప్రచారం జరిగింది. ఇటీవల రానా లుక్ చూసిన ఆయన అభిమానులు షాక్ కు గురయ్యారు. తాజాగా దగ్గుబాటి రానా ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై సురేష్ బాబు స్పందించారు. రానా అనారోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని నిజానికి రానాకు చిన్నప్పుడే కంటి సమస్య ఉండేదని, అయితే చిన్న వయసులో కంటి చికిత్స చేస్తే రానా తట్టుకోలేడని, పెద్దయిన తర్వాత చికిత్స చేసుకుంటే బాగుంటుందని డాక్టర్లు సూచించారని తెలిపారు సురేష్ బాబు. అందుకే తాజాగా రానా కంటికి చికిత్స చేయించుకున్నారని సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. చికిత్స ఈ మద్యే పూర్తయిందని, సర్జరీ జరిగిన తర్వాత రానా ఎక్కువ టెన్షన్ పడడంతో కాస్త వీక్ అయ్యాడని సురేష్ బాబు చెప్పుకొచ్చారు. అంతే కానీ తన కొడుక్కి ఏం కాలేదని ఇంకొన్ని రోజుల్లో మళ్లీ మునుపటిలా తిరిగి వస్తాడని సురేష్ బాబు తెలిపారు. రానా ఆరోగ్యం గురుంచి సురేష్ బాబు క్లారిటీ ఇవ్వడంతో ఊపిరిపీల్చుకున్నారు.

Related posts