telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్టీఆర్ బయోపిక్ సెన్సార్ టాక్… స్పెషల్ షోలు లేవు

NTR Biopic

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రను పోషిస్తూ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఎన్టీఆర్ బయోపిక్”. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగమైన “కథానాయకుడు” చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ “యు” సర్టిఫికెట్ ను పొందింది. అయితే కొన్ని రోజుల క్రితం “కథానాయకుడు” సెన్సార్ సమస్యలతో సతమతమవుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ చిత్రంలో ఎలాంటి కట్స్ కు తావివ్వకుండా క్రిష్ చాలా అందంగా తెరకెక్కించాడని చెబుతున్నారు. బాలకృష్ణ నటన అద్భుతంగా ఉందని అంటున్నారు. 2 గంటల 50 నిమిషాల నిడివితో సినిమా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక కీరవాణి నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అని తెలుస్తోంది.

ఇక ఈ నేపథ్యంలోనే “కథానాయకుడు” సినిమాకు తెలంగాణాలో స్పెషల్ షోలు లేవని స్పష్టమైపోయింది. అభిమానులను అదుపు చేయలేకపోవడం, అనవసరమైన ట్రాఫిక్ ఇష్యూల కారణంగా బెనిఫిట్ షోల ప్రస్తావన రానివ్వడం లేదు. ఈ మధ్యకాలంలో విడుదలైన చాలా సినిమాలకు తెలంగాణా రాష్ట్రంలో స్పెషల్ షో పర్మిషన్ దొరకలేదు. ఇక ఆంధ్రాలో మాత్రం ఉదయం 5 గంటల షోలు ఉన్నాయి. ఇంకా జనవరి 8న యుఎస్ లో ప్రీమియర్ షోలు పడతాయి. ఇక రెండవ భాగమైన “మహానాయకుడు” చిత్రాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నారు.

Related posts