telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ప్రేయసికి టిక్ టాక్ వీడియో పెట్టి.. ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య!

tik tok

ప్రియురాలికి టిక్ టాక్ వీడియో పెట్టి ఫ్యాన్ కు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరణించిన ఘటన కామారెడ్డి జిల్లా అశోక్ నగర్ కాలనీలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం తిమ్మక్ పల్లికి చెందిన గుర్రాల సంతోష్ (22), తన ఇద్దరు అన్నలతో కలిసి హైదరాబాద్ లో పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా నిలిచాడు.డ్రైవింగ్ చేసే సంతోష్ హైదరాబాదులో ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు సంతోష్ ను మందలించి, తమ బిడ్డను వరంగల్ కు తీసుకెళ్లిపోయారు.

అప్పటి నుంచి కుంగిపోయిన సంతోష్ తన ప్రియురాలికి ఫోన్ చేస్తూ, కొంతకాలం తన బాధను పంచుకున్నాడు. ఇక నీ ఎడబాటును భరించలేనంటూ టిక్ టాక్ వీడియో చేసి, ఆమెకు పంపి, ఆపై ఉరేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.

Related posts