telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం: హరీష్‌ రావు

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌ రావు ఇవాళ గజ్వేల్ లో రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ అంతిమంగా గెలిచేది పనితీరే, మంచి తనమేనని… ఓట్ల కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసమే పని చేశామని తెలిపారు. 70 ఏళ్ళలో చేయని అభివృద్ధిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం 7 ఏళ్ళలో పూర్తి చేసిందని అన్నారు. తెలంగాణలో కొత్తగా 3 లక్షల 9 వేల 83 మందికి రేషన్ కార్డులు అందజేస్తున్నామని తెలిపారు.

ప్రస్తుతం కొత్త కార్డులతో కలిపి రాష్ట్రంలో అన్ని రకాల కార్డులు దాదాపు 90.50 లక్షలకు చేరగా.. లబ్దిదారులు 2 కోట్ల 88 లక్షల మందికి చేరుకున్నారని తెలిపారు. దేశంలో 90.5 శాతం జనాభాకు రేషన్ బియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు. రేషన్ పై ప్రతి ఏటా ప్రభుత్వం రూ.2,766 కోట్లు, ప్రతి నెలా రూ.232 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని హరీష్‌ రావు వెల్లడించారు.

Related posts