ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శనాస్త్రాలు సంధించారు. గుంటూరులో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు ఎవరి పొలంలో వాళ్లు మట్టి తీసుకోవాలంటే అధికారుల అనుమతి కావాలా? అందుకు మైనింగ్ శాఖకు డబ్బుల కట్టాలా? అంటూ మండిపడ్డారు.
టీడీపీ హయాంలో చేసిన పనులు ఆదర్శవంతంగా ఉన్నాయని అన్నారు. ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేశామని, మురుగు కాల్వలు కట్టించామని, శ్మశానాలు ఏర్పాటు చేశామని, ఏడు లక్షల పంటగుంటలు తవ్వామని గుర్తుచేశారు. ఆ పంట గుంటలకు ఈ ఏడాదిలో పదిసార్లు నీళ్లొచ్చాయని, తద్వారా భూగర్భజలాలు పెరిగి కరవు తీరిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రిగేషన్ కు సంబంధించి ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదని విమర్శించారు.
ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవాలి: కేటీఆర్