telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

‘రెమ్‌డెసివిర్‌’ స్టాక్‌ మొత్తం అమెరికా కొనుగోలు!

Remidisivir corona

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కు ఔషధాన్ని కనుగొనేందుకు ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలో ఉపయోగపడుతున్న ‘రెమ్‌డెసివిర్‌’ డ్రగ్‌ స్టాక్‌ మొత్తాన్ని అమెరికా కొనుగోలు చేసింది. దీంతో మూడు నెలల వరకు అమెరికా నుంచి ఇతర దేశాలకు ఈ ఔషధం అందే అవకాశం లేదు.

అమెరికాకు చెందిన బయో ఫార్మా సంస్థ గిలీడ్‌ సైన్సెస్‌ ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఈ డ్రగ్‌ను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం కోసం గిలీడ్‌ సైన్సెస్‌ భారత్‌కు చెందిన కొన్ని జనరిక్‌ ఫార్మా సంస్థలతోనూ ఇప్పటికే‌ ఒప్పందాలు కుదుర్చుకుంది. ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో ముందుకెళ్తున్న ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ తీరుకి అనుగుణంగా ఆ సంస్థ అమెరికాకే మొదట డ్రగ్ స్టాక్‌నంతా ఇవ్వనుంది.

దాదాపు ఐదు లక్షల డోసులకు అమెరికా ఆర్డర్లు ఇచ్చింది. ‌ఈ నెల ఆ సంస్థ ఉత్పత్తి చేసే 100 శాతం డోసులు, ఆగస్టులో ఉత్పత్తి చేసే 90 శాతం, సెప్టెంబరు నెల ఉత్పత్తిలో 90 శాతం డ్రగ్‌ అమెరికాకే ఇవ్వనుంది.అమెరికన్లకు ఆ డ్రగ్‌ అందు బాటులో ఉండేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారని అమెరికా వైద్యశాఖ మంత్రి అలెక్స్‌ అజార్‌ ప్రకటించారు.

Related posts