పండుగల సందర్భంగా ల్యాప్‌టాప్ తయారీ సంస్థలు ఆఫర్లతో పోటీపడుతున్నాయి. కస్టమర్లు రూ.50,000 వరకు ఇన్‌స్టాంట్ క్యాష్‌బ్యాక్ దక్కించుకోవచ్చు. 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్ సైతం అందుకోవచ్చు. అష్యూర్డ్ గిఫ్ట్స, రివార్డులు, బోనస్ పాయింట్లు అదనం. వడ్డీ లేని వాయిదాల్లో ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. నెలవారీ వాయిదా రూ.1,400లతో ప్రారంభం అవుతుంది.
హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఆసస్ కంపెనీలు కొత్త మోడళ్లతో రంగంలోకి దిగాయని ఖైరతాబాద్‌లోని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. సీజన్ కోసం కంపెనీలు ఇప్పటికే 25 దాకా కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాయని చెప్పారు.