telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మళ్ళీ .. 80లు దాటేస్తున్న .. పెట్రో ధరలు..

petrol prices raising day by day

ఆరాంకో చమురు కర్మాగారంపై జరిగిన డ్రోన్ దాడి అంతర్జాతీయంగా చమురు మార్కెట్‌పై పెను ప్రభావం చూపిస్తుంది. దీంతో ధరలు భగ్గుమంటున్నాయి. పెరుగుతున్న రేట్లతో సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు. దీనిపై ఆధారపడిన వస్తువుల ధరలు కూడా అధికమౌతున్నాయి. రానున్న రోజుల్లో ధరలు ఎంత పెరుగుతాయనే ఆందోళన వాహనదారుల్లో కనిపిస్తోంది. సెప్టెంబర్ 27వ తేదీ శుక్రవారం న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 74.34 ఉండగా..డీజిల్ ధర రూ. 67.14 ఉంది. అదే ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 80, డీజిల్ రూ. 70.55గా ఉంది. కోల్ కతాలో లీటర్ పెట్రోల్ రూ. 77.03, డీజిల్ రూ. 69.66, చెన్నైలో పెట్రోల్ రూ. 77.28, డీజిల్ రూ. 71.09గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 79.02, డీజిల్ లీటర్ రూ. 73.29గా ఉంది.

పెట్రో ఉత్పత్తులపై రెండు రకాల పన్నులు విధిస్తుండడంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, మొత్తం ధరపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వేస్తోంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరుగుతున్నాయి. తూర్పు సౌదీ అరేబియాలోని అబ్‌కైక్‌, ఖురైస్‌లో ఉన్న ఆరాంకో ప్లాంట్లపై ఇటీవలే యెమనీ తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆయిల్ రిఫైనరీ పై దాడుల కారణంగా చమురు శుద్ధి ప్రక్రియకి భారీ ఆంటంకం ఏర్పడింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని చమురు మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు. సౌదీ ప్రభుత్వ చమురు క్షేత్రాలపై జరిగిన డ్రోన్‌ దాడులతో ఆ దేశం చమురు ఉత్పత్తి సగానికి సగం పడిపోయింది.

Related posts