తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 3527 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 24 గంటల్లో 19 మృతి చెందారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 571044 కి చేరుకుంది. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 530025 మంది కోలుకున్నారు. తాజా మరణాలతో రాష్ట్రంలో మొత్తం 3226 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.9 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.56 శాతానికి పడిపోయిందని.. రికవరీ రేటు దేశంలో 92.81 శాతంగా ఉంటే.. స్టేట్‌లో 89.83 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, ప్రస్తుతం 27793 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో 97,236 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
previous post
next post
పవన్ పై పోటీకీ నేను సిద్దం: కేఏ పాల్