telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ సీబీఐ కోర్టుకు మంత్రి బొత్స

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. వోక్స్ వ్యాగన్ కేసులో సాక్షిగా బొత్స కోర్టుకు హాజరయ్యారు. వోక్స్ వ్యాగన్ సంస్థ కోసం వశిష్ట వాహన్ అనే సంస్థకు రూ. 11 కోట్లు చెల్లించిన కుంభకోణంలో ఈ కేసులో అళగ రాజా, వశిష్ట వాహన్ సీఈవో సూష్టర్, జైన్, గాయత్రిలపై బీసీఐ అభియోగాలు మోపి, కేసులు నమోదు చేసింది.

రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో విశాఖలో కార్ల ఫ్యాక్టరీ స్థాపన కోసం వోక్స్ వ్యాగన్ కు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వశిష్ట వాహన్ కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11 కోట్ల రూపాయలను చెల్లించింది. అయితే, తమకు వశిష్ట వాహన్ సీఈవో సూష్టర్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని వోక్స్ వ్యాగన్ ప్రకటించింది. ఈ అంశంలో అప్పట్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్సపై ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఈ కేసును సీబీఐకి రాజశేఖరరెడ్డి అప్పగించారు. 2005లో కేసు నమోదు చేసిన సీబీఐ ఇప్పటి వరకు 59 మంది సాక్షులను విచారించింది.

Related posts