ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లోకి ఎవరు వెళ్తారు అనేది చాలా ఆసక్తిగా మారింది. అయితే ఇంగ్లాండ్-భారత్ మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ అయిన పింక్ టెస్ట్ లో ఓడిన తర్వాత ఇంగ్లాండ్ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ రేసు నుండి తప్పుకుంది. అయితే భారత్ తో జరుగుతున్న ఈ నాలుగు టెస్టుల సిరీస్ లో కనీసం మూడు మ్యాచ్ లలో విజయం సాధిస్తే ఇంగ్లాండ్ హాట్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ కు వెళ్ళేది. కానీ వారు ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్ లలో రెండు ఓడిపోవడంతో ఆ రేస్ నుండి తప్పుకున్నారు. అయితే ఈ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోని రెడ్ స్థానాల్లో ఒక్కటి ఇప్పటికే న్యూజిలాండ్ సొంతం చేసుకోగా రెండో దాని కోసం ఇప్పుడు భారత్, ఆసీస్ పోటీలో ఉన్నాయి. ఇంగ్లాండ్ తో జరగబోయే చివరి టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించిన లేక ఆ మ్యాచ్ ను డ్రా చేసుకున్న భారత్ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ కు వెళ్తుంది. ఒక వేళా ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధిస్తే ఆసీస్ ఫైనల్స్ కు వెళ్తుంది. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ అర్హతను పాయింట్స్ తో కాకుండా విజయాల శాతంతో కొలుస్తున్న విషయం తెలిసిందే. చూడాలి మరి చివరి మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది.
previous post
next post