telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూలు విడుదల

voter list

ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ప్రత్యేక సవరణ షెడ్యూలును తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రకటించారు. అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 16 నుంచి జనవరి 15 వరకు అవకాశం కల్పించారు. జనవరి 27 నాటికి వచ్చిన అభ్యంతరాల పరిష్కరించనున్నారు. ఫిబ్రవరి నాలుగున సరిచేసిన ఓటర్ల జాబితా పూర్తిచేసి ముద్రణకు ఇవ్వనున్నారు.

ఫిబ్రవరి ఏడున తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాకారి తెలిపారు. 2020 జనవరి ఒకటి నాటికి తెలంగాణలో మొత్తం 2,98,64,689 ఓటర్లు ఉండగా.. వారిలో పురుషులు 1,50,07,047, మహిళలు 1,48,56,076, ఇతరులు 1,566 మంది ఉన్నారు. కొత్తగా పెరిగిన ఓటర్ల మేరకు కొత్తగా 105 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.

Related posts