telugu navyamedia
క్రీడలు వార్తలు

కుల్దీప్ ను తీసుకోకపోవడం పై ఆకాశ్ స్పందన…

2020 t20 world cup is kuldeep target

టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌, ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో ఒక్క మణికట్టు స్పిన్నర్‌ లేకపోవడం తనను ఆశ్చర్యం కలిగించిందని టీమిండియా మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అన్నాడు. చోప్రా మాట్లాడుతూ… ‘వ్యక్తిగతంగా చెప్పాలంటే కుల్దీప్ యాదవ్‌కూ చోటివ్వకపోవడం కఠిన నిర్ణయమే. అతడు ఎక్కువ క్రికెట్‌ ఆడలేదనడం బాధాకరం. ఆస్ట్రేలియాలో ఆడలేదు. ఇక ఇంగ్లండ్ టెస్టు సిరీసులో ఒకే మ్యాచ్ ఆడాడు. అయితే బాగా ఇబ్బంది పడ్డాడు. కొన్ని వికెట్లు మాత్రమే తీశాడు. గులాబి టెస్టూ ఆడలేదు. ఇప్పుడు టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనలే కాదు ఏకంగా ఇంగ్లండ్ సిరీసు మొత్తానికీ ఎంపికవ్వలేదు. కరోనా పరిస్థితుల్లో ఎక్కువ మందితో జట్లను ప్రకటించే సౌలభ్యం ఇప్పుడు ఉంది. అలాంటప్పుడు యాదవ్‌కు ఎందుకు చోటివ్వలేదు’ అని ప్రశ్నించాడు. ‘ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌, అక్షర్‌ పటేల్‌ రూపంలో నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. కానీ వారంతా ఫింగర్‌ స్పిన్నర్లు. మణికట్టు స్పిన్నర్ల బౌలింగ్‌లో ఇబ్బందిపడే ప్రత్యర్థి ఉన్నప్పుడు కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు తీసుకోకూడదు. బీసీసీఐ సెలెక్టర్లు ఓసారి ఆలోచించండి’ అని ఆకాశ్ చోప్రా అన్నాడు. కుల్దీప్‌ను మాత్రమే కాదు పృథ్వి షా, భువనేశ్వర్‌ కుమార్, హార్దిక్‌ పాండ్యాలను కూడా బీసీసీఐ ఎంపిక చేయలేదు.

Related posts