telugu navyamedia
క్రీడలు వార్తలు

సర్టిఫికెట్ అవసరం లేదు.. లక్షణాలు ఉంటె చాలు

corona

ప్రస్తుతం మన దేశంలో 14 రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు.  కొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూ, లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.  ఇక ఇదిలా ఉంటె కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యే కరోనా రోగులకు సంబంధించి కొన్ని సవరణలు చేసింది.  కరోనా చికిత్సా ఆసుపత్రుల్లో రోగులను చేర్చుకోవడానికి కరోనా పాజిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదని, లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స అందించాలని ఆదేశించింది కేంద్రం.  ఎట్టి పరిస్థితుల్లో కూడా రోగులకు వైద్యం నిరాకరించవద్దని, వేరే ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు కూడా అవసరమైతే ఆక్సిజన్, మెడిసిన్స్ అందించాలని సవరణలో పేర్కొన్నది.  ఇక అన్ని ఆసుపత్రులు డిశ్చార్జ్ పాలసీని తప్పనిసరిగా పాటించాలని, రోగి ఆరోగ్య లక్షణాలు ఆధారంగా చేసుకొని డిశ్చార్జ్ చేయాలని కేంద్రం ఆదేశించింది.  కేంద్రం చేసిన సవరణాలు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆసుపత్రులు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.  

Related posts