టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ కోసం చేతన్ శర్మ నేతృత్వంలోని నేషనల్ సెలెక్షన్ కమిటీ 20 మందితో కూడిన భారత జట్టును శుక్రవారం ప్రకటించింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిన భారత జట్టునే ఈసారీ పరిగణనలోకి తీసుకున్నారు. కానీ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్, యువ ఓపెనర్ పృథ్వీ షాలపై వేటు పడింది. అయితే పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాల్సిందని అటు మాజీ క్రికెటర్లు, ఇటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. టీమ్ ఎంపిక నిష్పక్షపాతంగా జరగలేదని, కోహ్లీతో సన్నిహితంగా ఉన్న ఆటగాళ్లనే ఎంపిక చేశారని ఆరోపిస్తున్నారు. భారత జట్టులో కోహ్లీ చెంచాలకే అవకాశం దక్కుతుందని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. పృథ్వీ షా మంచి ఫామ్‌లో ఉన్నా.. అతన్ని కాదని, ఫిట్‌నెస్ లేని, ఆసుపాత్రిపాలైన కేఎల్ రాహుల్ అవకాశం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెన్నాళ్లు అతనికి అవకాశాలిస్తారని మండిపడుతున్నారు. దిగులు చెందవద్దని, తనకూ మంచి రోజులు వస్తాయని పృథ్వీ షాకు దైర్యం చెబుతున్నారు.
previous post
బాలయ్య డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదు: పోసాని