telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కొత్త వైరస్‌ ఎఫెక్ట్‌ : అప్పటి వరకు విమానాలు బంద్..

కరోనా ప్రపంచాన్ని కబలిస్తోంది. ప్రపంచ జనాభాను గడగడలాడిస్తోంది. రోజురోజుకు కరోనా విజృంభన భారీగా పెరిగిపోతుంది. ఇంతలో యూకేలో కొత్త రకం కరోనా వచ్చిందన వార్త ప్రజలను మరింత భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా బయటపడ్డా కొత్త రకం కరోనా మునపటి దాని కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దాంతో ప్రపంచ దేశాలు తమ ప్రజలను కాపాడుకునేందుకు యూకే నుంచి వచ్చే విమానాలను తాత్కాళికంగా నిలిపివేశాయి. వాటిలో భారత్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 22 నుంచి భారత్ యూకే నుంచి వచ్చే విమానలను, యూకేకు వెళ్లనున్న విమానాలను నిలిపివేసింది. అయితే నేడు కేంద్రం మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది. యూకే విమానలపై ఉన్న తాత్కాలిక నిలిపివేతను వచ్చే ఏడాది జనవరీ 7వరకు పొడిగించింది. ఈ వార్తను యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ తెలిపారు. ‘యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి రానున్న విమానాలపై విధించిన తాత్కాలిక నిలిపివేతను జనవరీ 7వరకు కొనసాగించనున్నాం. యూకేలో వచ్చిన కొత్త రకం కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామ’ని ఆయన అన్నారు. అంతేకాకుండా అనేక నిబంధనలను కూడా తప్పని సరి చేయనున్నట్లు, దానికి సంబంధించిన సమాచారం త్వరలో వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. గత వారమే యూకే విమానలపై నిలిపివేతను ప్రకటించామని, దానిని కొన్ని కారణాల వల్ల మరింత పొడిగిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే గత 14రోజులలో విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నా పాజిటివ్ అని తేలినా జీనోమ్ సీక్వన్సింగ్‌కు వెళ్లాలని కేంద్ర ఆరోఖ్య మంత్రిమండలి తెలిపింది. ఇప్పటి వరకు భారత్‌లో దాదాపు 20 కోత్త కరోనా కేసులు బయటపడ్డాయి. పాజిటివ్‌ అని తేలిన ప్రతి ఒక్కరు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే వారితో పాటు కలిసి ప్రయాణం చేసిన వారు, దగ్గిర బంధువులను ట్రేస్ చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ వారు తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నవంబరు25 నుంచి డిసెంబరు23 అర్థరాత్రి వరకు యూకే నుంచి భారత్‌కు వచ్చిన ప్రతి ప్రయాణికుడిని ట్రేస్ చేస్తున్నామని, ప్రతి ఒక్కరికి ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

Related posts