telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టికెట్ డబ్బులను తిరిగి ఇస్తారా?.. రిజర్వేషన్ ప్రయాణికుల గగ్గోలు!

apsrtc bus

తెలంగాణలో శుక్రవారం అరదరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో ఎక్కడిబస్సులు అక్కడ నిలిచిపోయాయి. దసరా, బతుకమ్మ పండగల కోసం స్వగ్రామాలకు వెళ్లాలని భావించిన ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ షాక్ ఇవ్వగా, ఇప్పటికే వివిధ దూరప్రాంత సర్వీసులకు రిజర్వేషన్లు చేయించుకున్న వారు తమ సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. గత రాత్రి నుంచి దూరప్రాంత సర్వీసులు నిలిచిపోగా, విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు చేయించుకున్న వారు గమ్యాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

వారందరి పరిస్థితి గందరగోళంగా మారింది. ప్రత్యామ్నాయ సర్వీసులను ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. టికెట్ డబ్బులను తిరిగి వెనక్కు ఇస్తారా? అనే విషయంలో స్పష్టత ఇచ్చేందుకు కూడా అధికారులు అందుబాటులో లేకపోయారు. హైదరాబాద్ లో ఎంజీబీఎస్ తో పాటు, పలు ప్రధాన నగరాల బస్టాండ్లలో ఎంక్వయిరీ కౌంటర్లు మూతపడ్డాయి.

ఇక నేటి నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు వేలాది మంది ఎన్నో రోజుల ముందుగానే టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు చేయించుకున్నారు. వారంతా తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు కట్ అవుతున్నాయని, క్యాన్సిల్ చేయకుండా ఉంటే డబ్బులు తిరగి ఇస్తారో, ఇవ్వరోనని ఆందోళన చెందుతున్నారు.

Related posts