telugu navyamedia
రాజకీయ వార్తలు

గెలిచినా, ఓడినా తానెక్కడికీ పారిపోవడం లేదు: కుమారస్వామి

CM Kumaraswamy killing order

విశ్వాసపరీక్ష సందర్భంగా కర్నాటక సీఎం కుమారస్వామి సభలో ఉద్వేగపూరితంగా మాట్లాడారు. సీఎం కుమారస్వామి ప్రసంగం అనంతరం బలపరీక్ష ప్రక్రియ ప్రారంభం కానుంది. గెలిచినా, ఓడినా తానెక్కడికీ పారిపోవట్లేదని.. సభలో బల నిరూపణ జరగాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. రాజకీయ పరిణామాలతో విసిగిపోయానన్నారు. ప్రజలను, ప్రతిపక్షాలను వేచిచూసేలా చేసినందుకు కుమారస్వామి క్షమాపణలు చెప్పారు.

ప్రసంగానికి తనకు 3 గంటల సమయం కావాలని కుమారస్వామి స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ ను కోరారు. త్వరగా ప్రసంగం ముగించాలని సీఎం కుమారస్వామికి స్పీకర్ సూచించారు. అసెంబ్లీలో కుమారస్వామి భావోద్వేగపూరితంగా ప్రసంగిస్తున్నారు. వ్యవసాయం నుంచి మా కుటుంబం రాజకీయాల్లోకి వచ్చింది. ప్రజల కోసం కష్టించి పనిచేయడమే మాకు తెలుసు. నేను ప్రభుత్వ కారు కూడా ఉపయోగించడం లేదు. ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయను. రాష్ట్రాభివృద్ధి కోసమే నిరంతరం శ్రమించానన్నారు.

Related posts